మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: ఎమ్మెల్యే
NGKL: అచ్చంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ తెలిపారు. 2, 14వ వార్డుల్లో జరిగిన 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' సభల్లో ఆయన పాల్గొన్నారు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక వసతులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకే ఈ సభలని పేర్కొన్నారు.