'నీట్ పరీక్షకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలి'

'నీట్ పరీక్షకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలి'

VZM: జిల్లాలో నిర్వహించబోయే నీట్ పరీక్షకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్. సత్తిబాబు అధికారులను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్‌లో వివిధ శాఖల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా ఎటువంటి ఆటంకం లేకుండా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.