గంజాయి తరలిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు
ASF: బెజ్జూర్ మండలంలోని సలగుపల్లి చౌరస్తా వద్ద గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సర్తాజ్ పాషా ఓ ప్రకటనలో తెలిపారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ ద్విచక్ర వాహనంపై సుమారు 3 కిలోల గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామని, మరొకరు పరారీలో ఉన్నట్లు ఎస్సై వెల్లడించారు.