భూగర్భ శాఖల అధికారులతో సమీక్షించిన భట్టి

భూగర్భ శాఖల అధికారులతో సమీక్షించిన భట్టి

KMM: భూగర్భశాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రీ-బడ్జెట్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర బడ్జెట్ త్వరలో రానున్న నేపథ్యంలో ఆయా శాఖల ప్రాధాన్యాలు, అమలులో ఉన్న కార్యక్రమాల పురోగతి, ఉపాధి అవకాశాల విస్తరణ, నైపుణ్యాభివృద్ధి, గనుల రంగ అభివృద్ధిపై ఆరా తీశారు. ప్రజలకు మెరుగైన సేవలందించే దిశగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు.