'ఫేస్, టాప్ మైండ్ కళాశాలలపై క్రిమినల్ పెట్టాలి'

KDP: ప్రొద్దుటూరులో ఫేస్, టాప్ మైండ్ కళాశాలలు ఆర్థిక విభేదాలు, అక్రమాల వల్ల 180 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని శుక్రవారం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎద్దు రాహుల్ తెలిపారు. సరైన మౌలిక సదుపాయాలు లేకుండా, విద్యా విధానాలకు విరుద్ధంగా నడుస్తున్న యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, విద్యార్థుల చదువు కొనసాగించాలంటూ ఆయన డిమాండ్ చేశారు.