ప్రమాదాలు.. పోలీసుల స్పెషల్ వీడియో
TG: రోడ్డు భద్రతపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అవగాహన వీడియోను రూపొందించారు. 'భారీ వాహనాలకు అన్ని వైపులా ప్రమాదకరమైన బ్లైండ్ స్పాట్‌లు ఉంటాయి. ఈ జోన్‌లలో ప్రయాణించడం లేదా డ్రైవింగ్ చేయడం వల్ల తీవ్రమైన ప్రమాదాలు సంభవించవచ్చు. అప్రమత్తంగా ఉండండాలి, సురక్షితంగా గమ్యం చేరుకోవాలి. భారీ వాహనాల పక్కన వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి' అని సూచించారు.