ఆదోని మార్కెట్లో గరిష్ఠ పత్తి ధర ఎంతంటే..?

ఆదోని మార్కెట్లో గరిష్ఠ పత్తి ధర ఎంతంటే..?

KRNL: ఆదోని వ్యవసాయ మార్కెట్లో గురువారం పత్తి క్వింటా గరిష్ఠ ధర రూ.8,939లు పలికింది. వేరుశనగ రూ.7,729, ఆముదాలు రూ.6,076ల ధరలు లభించాయి. సీసీఐ కేంద్రాలు మూతపడటంతో పత్తి మొత్తం యార్డుకు వస్తోంది. అయితే మార్కెట్ యార్డులో మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు విఫలమయ్యారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేరుకే జాతీయ మార్కెట్ అని, కనీస సౌకర్యాలు లేవన్నారు.