భక్తుల ముంగిటకే మేడారం ప్రసాదం

భక్తుల ముంగిటకే మేడారం ప్రసాదం

SRPT: మేడారం జాతర ప్రసాదాన్ని భక్తుల ఇంటికే చేరవేసేలా టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సూర్యాపేట డిపో మేనేజర్ సునీత సంబంధిత పోస్టర్లను ఆవిష్కరించారు. రూ. 299 చెల్లించి ఆన్‌లైన్ లేదా కౌంటర్లలో బుక్ చేసుకుంటే ప్రసాదం, పసుపు, కుంకుమలను ఇంటికే డెలివరీ చేస్తామన్నారు. ఫిబ్రవరి 5 వరకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.