డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి జరిమానా

డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి జరిమానా

PDPL: రామగుండంలో ఇటీవల నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన 15 మందిని గోదావరిఖని కోర్టులో మంగళవారం హాజరుపరిచినట్లు ట్రాఫిక్ CI రాజేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు 15 మంది మందు బాబులకు రూ.2 వేలు చొప్పున జరిమానా విధిస్తూ జడ్జి వెంకటేశ్ దుర్వ తీర్పు వెల్లడించారని ఆయన పేర్కొన్నారు. రెండోసారి పట్టుబడిన ఇద్దరికి 3 రోజుల జైలు శిక్ష విధించినట్లు పేర్కొన్నారు.