VIDEO: 'బొజ్జా తారకం మహోన్నత వ్యక్తి'

VIDEO: 'బొజ్జా తారకం మహోన్నత వ్యక్తి'

E.G: అణగారిన వర్గాల గొంతుకై మానవ హక్కుల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి బొజ్జా తారకం అని ఆదివాసి మహాసభ న్యాయ సలహాదారుడు అయినాపురపు సూర్యనారాయణ అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన ఆయన 9వ వర్ధంతి కార్యక్రమంలో తారకం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హక్కుల నేతగా, దళితుల పక్షాన పోరాటం చేసి ఆయన ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని తెలిపారు.