400 కేజీల యురేనియంపై ట్రంప్ కన్ను..!
ఇరాన్ వద్ద 400 కేజీల శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్నట్లు అమెరికా సైనిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నిల్వలను ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారు. ఇరాన్ వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ యురేనియం ఉండకూడదని ఇప్పటికే ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం ఇరాన్‌లో సైనిక బలగాలతో భూతల దాడులు చేయడానికి ట్రంప్ సిద్ధమైనట్లు అమెరికా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.