ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ

SRD: మనూరు మండలం పుల్కుర్తి గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి గురువారం భూమి పూజ చేశారు. మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోతుల మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదల సొంత ఇంటి కలలు నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తోందని తెలిపారు. ఇందులో సంగమేశ్వర్, బాబుమీయ, మాలిక్, శ్యామన్న, పండరి, గోపాల్, ఆంజనేయులు ఉన్నారు.