ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

GDWL: దౌదర్ పల్లి రోడ్డులోని శ్రీ బండ బావి ఆంజనేయస్వామి దేవాలయం హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన భక్తులకు వితరణ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నియోజకవర్గంలోని రైతులు, ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్నారు.