బస్సు ప్రమాదం.. ముగ్గురు అక్కాచెల్లెలు మృతి

బస్సు ప్రమాదం.. ముగ్గురు అక్కాచెల్లెలు మృతి

VKB: చేవెళ్ల దగ్గర జరిగిన ఆర్టీసీ బస్సు రోడ్డు ప్రమాదంలో తాండూర్ పట్టణం వడ్డెర గల్లిలోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్క చెల్లెలు మృతి చెందారు. తండ్రి ఎల్లయ్య గౌడ్ ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నాడు. వీరికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. అక్టోబర్ 17న పెద్ద కుమార్తె అనూష పెళ్లి జరిగింది. ముగ్గురు మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.