5 బంతుల్లో 5 వికెట్లు.. 'ఫస్ట్ క్లాస్' రికార్డ్
న్యూజిలాండ్ దేశవాళీలో సెంట్రల్ డస్ట్రిక్ట్స్ బౌలర్ బ్రెట్ రాండెల్ సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. నార్తర్న్ డిస్ట్రిక్ట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుసగా 5 బంతుల్లో 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో 254 ఏళ్ల ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా అవతరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది.