VIDEO: డిగ్రీ కళాశాల ముందు నీరు.. విద్యార్థుల ఆవేదన
WGL: వర్ధన్నపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు గత కొన్ని రోజులుగా నీరు పారుతుండడంతో విద్యార్థులు, బోధనా సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. కళాశాలలోకి వెళ్లాలంటే నీటిలో నుంచే వెళ్లాల్సి వస్తోందని, ఎవరూ సమస్యను పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.