'ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు ఎదురు కాకూడదు'
MBNR: ఈ వానకాలం సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ రైతులకు ఇబ్బంది లేకుండా సాఫీగా నిర్వహించేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వీసీ కాన్ఫరెన్స్ హాల్‌లో వానాకాలం 2025- 26 (ఖరీఫ్ ) ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు అధికారులు పాల్గొన్నారు.