గంగాధరలో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' కార్యక్రమం
KNR: గంగాధర మండలం మధురానగర్ గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక' గ్రామసభలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆశ్విని తానాజీ వాకడేతో కలిసి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోందని అన్నారు.