మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం
చిత్తూరు జిల్లా ఎన్.ఆర్.పేట పరిధిలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈస్ట్ సర్కిల్ సీఐ కె. రామచంద్ర మాట్లాడుతూ.. మహిళల రక్షణకు పోలీస్ శాఖ ప్రాధాన్యం ఇస్తోందన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు, కాల్స్‌కు స్పందించవద్దని సూచించారు. సమస్యలు ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని మహిళలకు అవగాహన కల్పించారు.