VIDEO: నర్సీపట్నంలో మొదలైన శబరిమల యాత్రలు
AKP: నర్సీపట్నంలో శబరిమల యాత్రలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. 41 రోజులపాటు నియమ నిబంధనలతో దీక్షలు చేపట్టిన అయ్యప్ప స్వాములు ఇరుముడి కట్టుకొని శబరిమలకు పయనమయ్యారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయం వద్ద కొలహాల వాతావరణం నెలకొంది. మండలం ప్రారంభం కావడంతో అయ్యప్ప సన్నిధానంలో స్వామివారిని దర్శించేందుకు పలువురు భక్తులు సిద్ధమవుతున్నారు.