త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి'
కృష్ణా: మచిలీపట్నంలోని టీడీపీ కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డ్రైనేజీ, త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. టీడీపీ ఇంచార్జ్‌లు ప్రజల్లోకి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ హామీలను వివరించాలన్నారు.