మద్యం మత్తులో చిన్నారిని నేలకేసి బాదాడు..!
HYD: జగద్గిరిగుట్టలో దారుణం జరిగింది. శివ అనే వ్యక్తి ఇవాళ మద్యం మత్తులో కృష్ణవేణి అనే మహిళ ఇంటికి వచ్చి గొడవకు దిగి, ఆమె నాలుగేళ్ల కూతురు వెన్నలను నేలకేసి బాదాడు. తీవ్ర గాయాలైన చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లగా, స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.