VIDEO: పేకాట రాయుళ్లపై పోలీసుల డేగకన్ను
KDP: జమ్మలమడుగు పట్టణం చుట్టూ ప్రాంతాలను డ్రోన్ కెమెరాల ద్వారా బీట్ నిర్వహించామని అర్బన్ సీఐ నరేశ్ బాబు తెలిపారు. గురువారం కన్నెలూరు ప్రాంతంలో రెండు ప్రదేశాల్లో పేకాట ఆడుతున్న పది మందిని పట్టుకొని వారి వద్ద నుంచి రూ.8600 వేలు స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశామన్నారు. ఎవరైన చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.