ఘనంగా కన్యకా పరమేశ్వరి జయంతి

ఘనంగా కన్యకా పరమేశ్వరి జయంతి

KMR: బిక్కనూర్ మండల కేంద్రంలోని స్థానిక నాగేశ్వర ఆలయంలో కన్యకాపరమేశ్వరి జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహిళలు ఆలయంలో సామూహిక కుంకుమ అర్చనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను వితరణ చేసినట్లు ఆర్యవైశ్య సంఘ పట్టణ అధ్యక్షుడు పురం రాజమౌళి తెలిపారు.