రేపు మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశం
KDP: పులివెందుల పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాలులో శనివారం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాముడు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి కౌన్సిలర్లు, అధికారులందరూ హాజరు కావాలన్నారు. తాగునీరు, రోడ్లు, తదితర సమస్యలపై చర్చించనున్నారు.