అప్పయ్య గారిపల్లిలో ఇంటింటికీ కుళాయి పనులు
సత్యసాయి: నల్లమాడ పంచాయతీ పరిధిలోని అప్పయ్య గారిపల్లిలో ఇంటింటికీ కుళాయిలు అందించే నూతన పైప్‌లైన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. గ్రామస్తులకు తాగునీటి సమస్య లేకుండా, సురక్షితమైన నీటిని అందించే లక్ష్యంతో ఈ పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.