BREAKING: బీజేపీ MLAకి ఏడేళ్ల జైలు శిక్ష

ఓబుళాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు 15 ఏళ్ల తర్వాత తుది తీర్పు వెలువరించింది. ఏ1 బీవీ శ్రీనివాస్ రెడ్డి, ఏ2 గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. అలాగే మరో ముగ్గురిని దోషులుగా తేల్చిన కోర్టు.. వారికి కూడా ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. కాగా, గాలి జనార్ధన్ రెడ్డి కర్ణాటక నుంచి BJP MLAగా ఉన్నారు.