శంకర్ ఫౌండేషన్ వారి ఉచిత కంటి వైద్య శిబిరం

అనకాపల్లి: జిల్లా మండల కేంద్రం కే కోటపాడు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో జిల్లా అంధత్వ నివారణ సంస్థ అనకాపల్లి వారి సౌజన్యతో, శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి విశాఖపట్నం మరియు వాసవి క్లబ్, సౌజన్యంతో కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 85 మంది కంటి పరీక్షలు చేసుకోగా, కొంతమందికి ఆపరేషన్ అవసరమని నిర్ధారించారు.