భారత నౌకలు సురక్షితంగా ఉన్నాయి: కేంద్రం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ హర్మూజ్ జలసంధి, గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న భారత నౌకలు సురక్షితంగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే ఆ నౌకల్లో ఉన్న సిబ్బంది కూడా సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది. గడిచిన 2 రోజుల్లో భారత జెండాతో ప్రయాణిస్తున్న గ్రీన్ సంఘ్వీ, గ్రీన్ ఆశా నౌకలు LPGతో జలసంధిని దాటినట్లు చెప్పింది. ఈ వారంలో అవి తీరానికి చేరుకుంటాయని పేర్కొంది.