VIDEO: నవధాన్యాలు వేద్దాం - భూ సారం పెంచుదాం

PPM: వేసవి కాలంలో భూమిలో నవధాన్యాలు వేసి భూ సారం పెంచుదాం అని మండల వ్యవసాయ అధికారి కొల్లి తిరుపతి రావు పిలుపునిచ్చారు. మంగళవారం పాచిపెంట మండలం విశ్వనాథపురం గ్రామంలో పకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ప్రతి రైతు తమకున్న భూమిలో కొంతమేరకైనా ఎరువులు లేకుండా పంటలు పండించాలని కోరారు. బోను మోహన్ పాల్గొన్నారు.