తాళం వేసిన ఇంట్లో చోరీ

తాళం వేసిన ఇంట్లో చోరీ

అన్నమయ్య: మదనపల్లె పట్టణంలోని చంద్రా కాలనీలో మంగళవారం సాయంత్రం తాళం వేసిన ఇంట్లో దొంగలు పడ్డారు. బాధితురాలు ఫాతిమా టైలరింగ్ పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఆమె ఇంటికి వచ్చి చూడగా, తాళాలు పగలగొట్టి, ఇంట్లో దాచిన రూ. లక్షకు పైగా నగదు, బంగారు ఆభరణాలను దొంగలు అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రెండో పట్టణ సీఐ మహ్మద్ రఫీ కేసు నమోదుచేశారు.