VIDEO: గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం
కృష్ణా: మచిలీపట్నంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. పంపుల చెరువులో ఇవాళ స్థానికులు నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. సుమారు 40 ఏళ్ల వయస్సు గల వ్యక్తి బ్లూ జీన్స్, లైట్ బ్లూ షర్ట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు పోలీసులను సంప్రదించాలన్నారు.