17న JNTU స్నాతకోత్సవం

అనంతపురం: JNTU స్నాతకోత్సవం ఈ నెల 17న జరగనుంది. ఈ మేరకు యూనివర్సిటీ ఛాన్స్‌లర్, ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరంలో బీటెక్, బీ ఫార్మసీ, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎమ్మెస్సీ పూర్తి చేసిన విద్యార్థులకు స్నాతకోత్సవ పట్టాలు అందజేస్తారు. పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి డాక్టరేట్ ప్రదానం చేస్తారు.