విద్యుత్‌షాక్‌తో విద్యా కమిటీ చైర్మన్ మృతి

కృష్ణా: నూజివీడు మండలం మీర్జాపురం గ్రామంలోని జడ్పీ హైస్కూల్ విద్యా కమిటీ చైర్మన్ పిన్ని బోయిన రామకృష్ణ(36) విద్యుత్ షాక్‌తో గురువారం రాత్రి మృతి చెందాడు. కొత్తగా వేస్తున్న విద్యుత్ స్తంభాలకు పక్కనే ఉన్న స్తంభాల వైర్లు ఆనుకొని ఉండడంతో విద్యుత్ ప్రసారం కావడం వలన రామకృష్ణ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.