నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NGKL: అచ్చంపేట సబ్ డివిజన్ పరిధిలోని ఆరు మండలాల్లో శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపి వేయనున్నట్లు నాగర్ కర్నూల్ డివిజనల్ ఇంజినీర్ శ్రీధర్ శెట్టి తెలిపారు. సరఫరాను మెరుగుపరిచేందుకు రెండో లైన్ పనులు చేపడుతున్నామని అన్నారు. దీంతో అచ్చంపేట, ఉప్పునుంతల, అమ్రాబాద్, పదర, లింగాల,బల్మూరు మండలాల్లో ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరాను నిలిపివేయనున్నారు.