నిజాంసాగర్ ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి వేత
కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ జలాశయానికి ఎగువ నుంచి స్వల్పంగా వరద వస్తోంది. ప్రస్తుతం 2,498 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. ఇవాళ ఉదయం ఒక గేటు ఎత్తి అధికారులు అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1405 (17.8 టీఎంసీలు) కాగా ప్రస్తుతం అంతే మొత్తంలో నీరు నిల్వ ఉంది.