84 మంది మందుబాబులకు జరిమానాలు

84 మంది మందుబాబులకు జరిమానాలు

SRCL: వేములవాడ పట్టణంలోడ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 84 మందికి కోర్టు జరిమానాలు విధించింది. వీరిలో 17 మందికి రూ.5,000ల చొప్పున, 21 మందికి రూ.4,000లు మిగిలిన 46 మందికి రూ.2,000ల చొప్పున జరిమానా విధిస్తూ మెజిస్ట్రేట్ జ్యోతిర్మయి తీర్పునిచ్చారు. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు ఈ తనిఖీలు నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.