నదిలో గల్లంతైన యువకుడు మృతదేహం లభ్యం

నదిలో గల్లంతైన యువకుడు మృతదేహం లభ్యం

NRML: మామడ మండలంలోని పొన్కల్ గ్రామ సమీపంలోని సదర్ మట్ మినీ బ్యారేజీ వద్ద గురువారం గల్లంతైన యువకుడు మృతదేహం శుక్రవారం లభ్యమైంది. గ్రామానికి చెందిన సిద్దు(19) చేపల వేట కోసం వెళ్లి కాలుజారి బ్యారేజీపై నుంచి గోదావరి నదిలో పడిపోయాడు. దీంతో యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన చీకటి కావడంతో గంగ పుత్రులు ఇంటికి తిరిగి వచ్చారు. మరల ఉదయం వెళ్లి చూసేసరికి శవం తేలడంతో బయటకు తీశారు.