వికృతమాలలో శ్రీవారికి వేడుకగా శుక్రవారాభిషేకం

వికృతమాలలో శ్రీవారికి వేడుకగా శుక్రవారాభిషేకం

TPT: ఏర్పేడు మండలంలోని వికృతమాలశ్రీ సంతాన సంపద శ్రీ వేంకటేశ్వర స్వామికి శాస్త్రోక్తంగా శుక్రవారాభిషేకం నిర్వహించారు. సుగంధ భరితమైన వస్తువుల మిశ్రమంతో శ్రీవారికి సుప్రభాత సమయం నుంచి అభిషేకం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఆలయ పండితులు రత్నాకరం రామాచార్యులు కృష్ణమాచార్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.