16న మదనపల్లిలో మాల మహా సభ
CTR: SCవర్గీకరణ, క్రిమిలేయర్ విధానానికి వ్యతిరేకంగా ఈ నెల 16న మదనపల్లిలో జరుగు మాల మహా సభ విజయవంతానికి ఐక్యత చాటలని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి అశోక్ పిలుపునిచ్చారు. శుక్రవారం పుంగనూరులో ఆయన మాట్లాడారు. APతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రల నుంచి ముఖ్య దళిత నాయకులు హాజరువుతారని తెలిపారు. అనంతరం ప్రతి ఒక్కరు పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరారు.