భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న MLC సురభి

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న MLC సురభి

WGL: భద్రకాళి అమ్మవారిని పీవీ నరసింహారావు కూతురు, ఎమ్మెల్సీ సురభి వానిదేవి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముందుగా వల్లభ గణపతిని దర్శించుకున్న అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు సిద్ధేశ్వర శర్మ అమ్మవారి శేష వస్త్రం, గాజులు, కుంకుమతో పాటు ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్త తోనుపునూరి వీరన్న పాల్గొన్నారు.