జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం!
NZB: జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. సిరికొండ, కమర్ పల్లి అటవి పరిధిలో పులి సంచరిస్తున్నట్లు తెలుస్తుంది. తాటిపల్లి గ్రామంలో పెద్దపులి పాదముద్రలు లభించాయి. ఈనేపథ్యంలో అటవి అధికారులు ముడు చోట్ల ట్రాప్ కెమోరాలు ఏర్పాటు చేశారు. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పెద్దపులి సంచారంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.