VIDEO: తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్
కృష్ణా: గన్నవరంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ బాలాజీ బుధవారం సందర్శించి, పలు రిజిస్టర్లు, దస్త్రాలను తనిఖీ చేశారు. వివిధ అంశాలకు సంబంధించిన రిజిస్టర్లు, నెలవారి నివేదికలు, పలు సర్వేల పురోగతి, కార్యాలయంలోని ఖాళీ పోస్టులు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఆయన సిబ్బంది అటెండెన్స్, తదిత పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు.