VIDEO: జ్ఞానాంబిక దేవికి అభిషేక పూజలు

WNP: కొత్తకోట మండలం కానాయిపల్లి సుప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ కోటిలింగేశ్వరదత్త ఆలయంలో శుక్రవారం ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకుల ఆధ్వర్యంలో భక్తులు శ్రీ జ్ఞానాంబికాదేవి అమ్మవారికి శాస్త్రోక్తంగా అభిషేకపూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ధూప, దీప, నైవేద్యాలు, మహా మంగళహారతి సమర్పించారు. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.