దుబాయ్ గగనతలంలో హైటెన్షన్
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో క్షిపణి శిథిలాలు పడిపోవడంతో గగనతలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భద్రతా కారణాల దృష్ట్యా విమానాల ల్యాండింగ్‌ను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో పలు విమానాలు గంటల తరబడి గగనతలంలోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరమవుతున్న వేళ ఈ ఘటన ప్రయాణికులను భయాందోళనకు గురిచేసింది.