రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే
ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం చింతలపాడు గ్రామంలో తోట రావులపాడు–ఏటూరు మధ్య నిర్మాణంలో ఉన్న రహదారి పనులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆదివారం పరిశీలించారు. పనుల నాణ్యత, పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ అభివృద్ధికి రోడ్ల ప్రాముఖ్యత అపారమని పేర్కొంటూ, పనులను గడువులోగా నాణ్యతతో పూర్తిచేయాలని ఆదేశించారు.