నెల్లూరులో ఒంగోలు యువకుడి మృతి

నెల్లూరులో ఒంగోలు యువకుడి మృతి

ప్రకాశం: నెల్లూరు జిల్లా పోతిరెడ్డిపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒంగోలుకు చెందిన గుర్రం యగ్నేశ్ మృతిచెందాడు. ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు మృతి చెందారు. మృతులలో యగ్నేశ్‌తో పాటు జీవన్ నరేష్ అభిసాయి అభిషేక్ రమణయ్య ఉన్నారు. శుభకార్యానికి హాజరై తిరిగివస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగినట్లు సమాచారం. యగ్నేశ్ మృతితో ఒంగోలు రాంనగర్లో విషాదం నెలకొంది.