మద్యపాన నిషేధం పై గ్రామస్తులు తీర్మానం
MDK: అల్లాదుర్గం మండలం బహిరన్ దిబ్బ గ్రామంలో సామాజిక మార్పులు ఆదర్శంగా నిలిచింది. గ్రామంలో సంపూర్ణ మధ్య నిషేధాన్ని అమలు చేస్తూ గ్రామపంచాయతీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. కుటుంబాలు చితికి పోవడానికి గమనించిన సర్పంచ్ వీరప్ప వార్డ్ మెంబర్లు, గ్రామ పెద్దలతో కలసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ వీరప్ప తెలిపారు. తీర్మాన కాపీని ఎస్సై శంకర్‌కి అందజేశారు.