VIDEO: గురుకులం పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే
కృష్ణా: గుడివాడ మండలం మోటూరు గురుకులం పాఠశాలను ఎమ్మెల్యే రాము మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్ ప్రాంగణంలో విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడి, వారి సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా వసతి గృహాల విద్యార్థులకు మెరుగైన వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.