జిల్లాలో ఐదు DRF బృందాలతో సేవలు

BDK: రానున్న వర్షాల దృష్ట్యా సంభవించే వరదలలో ప్రమాదవశాత్తు చిక్కుకున్న భాదితులను రక్షించడానికి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన 5 DRF బృందాలు నిత్యం అందుబాటులో ఉంటాయని భద్రాద్రి కొత్తగూడెం SP రోహిత్ రాజు అన్నారు. అత్యవసర సమయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా అన్ని శాఖల సమన్వయంతో ముందుకెళ్తున్నామని తెలిపారు.